నల్ల బ్యాడ్జీలతో సీఐటీయూ నిరసన

నవతెలంగాణ – రామగిరి  
యువ రైతును మట్టుబెట్టిన దానికి నిరసనగా  రామగిరి సీఐటీయూ మండల కమిటీ ఆద్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యాకడు దొమ్మటి కొమురయ్య హాజరై మాట్లాడారు. బీజేపీ కేంద్ర, హర్యానా ప్రభుత్వాలు యువ రైతు శుభకరన్ సింగ్ ను పంజాబ్ బార్డర్ లో క్రూరంగా హత్య చేశాయనీ,దీనికి నిరసనగా ఫిబ్రవరి 23న బ్లాక్ డే అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో,పని ప్రదేశాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిర్వహించాలని అన్నారు. అలాగే జాతీయ రైతు సంఘాల పిలుపులో బాగంగా నిరసన వ్యక్తం  చేయడం జరిగిందని. భట్టిండా జిల్లా, బల్లో గ్రామం, చరణ్‌జిత్ సింగ్ కుమారుడు, 23 సంవత్సరాల వయస్సు గల యువ రైతు శుభకరన్ సింగ్ మృతి పట్ల  ఎస్ కె ఎం, జాయింట్ ప్లాట్ ఫాం ఆఫ్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పంజాబ్‌లోని ఖన్నోరీ సరిహద్దులో మొన్న (ఫిబ్రవరి 21) ఆయనను పోలీసులు కాల్చి చంపారు. నివాళులు అర్పించాలని రైతులు, కార్మికులతో సహా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాం అనీ అన్నారు. ఈ కార్యక్రమంలో  హామెద్ పాషా మండల కన్వీనర్ ఎండి అహ్మద్ పాష ,నాయకులు ఎం వెంకటేశ్వర్లు,ఎం ప్రభాకర్,ఎన్ రాజయ్య,బి రాజమల్లు, ఎన్ తిరుపతి,ఎం డి హబీబ్ పాషా,ఎం హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Spread the love