బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలపై  పోరాటాలకు సిద్ధం కావాలి: సీఐటీయూ

నవతెలంగాణ – భువనగిరి
బీజేపీప్రభుత్వ కార్పోరేట్ మతతత్వ  విధానాలపై కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని, ఫిబ్రవరి 16 న దేశవ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాలలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ అఖిలభారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండలో జరుగుతున్న సీఐటీయూ ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ సమావేశాలకు బయలుదేరుతూ మార్గమధ్యలో విశ్రాంతి కోసం భువనగిరిలోని న్యూ వివేరా హోటల్ కు చేరుకున్నారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు దాసరి పాండు,కల్లూరి మల్లేశంలు ఆల్ ఇండియా నాయకత్వానికి ఘనంగా స్వాగతం పలికారు .ఈ సందర్భంగా సీఐటీయూ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ మాట్లాడుతూ  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తుంది తప్ప పేదలు, కార్మికులు రైతులు, అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ మతోన్మాద విధానాలపై ఫిబ్రవరి 16 న దేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ,సంయుక్త కిసాన్ మోర్చా( ఎస్ కె ఎం) రైతు సంఘాల అధ్వర్యంలో జరిగే దేశ వ్యాప్త నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి తో పాటు ఆల్ ఇండియా సెక్రటరీలు ఎరమాలం కరిమ్ ,ఏ ఆర్ సింధు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రాష్ట్ర నాయకులు పుప్పాల శ్రీకాంత్ లకు జిల్లా నాయకత్వం ఘనంగా స్వాగతం పలకడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ , యస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు సీఐటీయూ నాయకులు యాదగిరి పాల్గొన్నారు.
Spread the love