– పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వచ్చే నెల ఆరున పోర్టర్ డ్రైవర్ పార్టనర్లు తలపెట్టిన సమ్మెకు సీఐటీయూ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతునిస్తోందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. పోర్టర్ డ్రైవర్ బాగస్వాములకు మేనేజ్‌మెంట్ కమీషన్ తగ్గించి, కిరాయిరేట్లు పెంచి వారి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల ఆరు లోపు వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్(సీఐటీయూ) పోర్టర్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబ్‌ా ధర్నా చౌక్‌లో నిర్వహిస్తున్న నిరసన దీక్షలను బుధవారం ఆయన సందర్శించారు.
ఈ సందర్బంగా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే .అజయ్ బాబు అధ్యక్షతన జరిగి సభలో భాస్కర్ మాట్లాడుతూ పోర్టర్ మేనేజ్‌మెంట్..పోర్టర్ డ్రైవర్ పార్టనర్ల శ్రమతోనే లాభాలు అర్జిస్తున్నదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. పెరిగిన ధరలకనుగుణంగా కిరాయిరేట్లు పెంచాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. పోర్టర్ మేనేజ్‌మెంట్ కమిషన్ 5-8శాతం తగ్గించుకుని డ్రైవర్ పార్టనర్ల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వారికి రూ.ఐదు లక్షల ప్రమాద బీమా, రూ. ఐదు లక్షల జీవిత బీమా కల్పించాలని కోరారు. సస్పెన్షన్లు వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆమోదించిన గిగ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ చట్టాన్ని వెంటనే అమలుల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ మాట్లాడుతూ పోర్టర్ డ్రైవర్లు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారమయ్యేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు.
పోరాటమే సమస్యల పరిష్కారానికి మార్గమన్నారు. బుధవారం దీక్షలను సీఐటీయూ సెంట్రల్ సిటీ కార్యదర్శి జే. కుమార్ స్వామి పూలమాలేసి ప్రారంభించారు. కార్యక్రమంలో పోర్టర్ కమిటీ జనరల్ సెక్రటరీ వీణ సాజిద్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.ఉమేష్ రెడ్డి ,వైస్ ప్రెసిడెంట్ మహేశ్లు మాట్లాడారు. సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు శ్రీనివాస్, టీఆర్‌సీపీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కె సతీష్ మద్దతు తెలియజేశారు. దీక్షలులో నరేష్, రామాంజనేయులు, రాజు, చరణ్ గౌడ్, రవికుమార్, మంజునాథ్, ప్రవీణ్, మహేష్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ నగర అధ్యక్షులు ఎం దశరథ్ వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు.
పోర్టర్ డ్రైవర్ పార్టనర్ల సమ్మెకు సీఐటీయూ మద్ధతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



