గోషామహల్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ ఒకరికి తీవ్ర గాయాలు…

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్ స్పెక్టర్ ముత్తు తెలిపిన వివరాల ప్రకారం… ఈ సామియా బజార్ కు చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు దిలీప్ గణాటే, సుల్తాన్ బజార్ మాజీ కార్పొరేటర్ రామచందర్ రాజుల మధ్య జరిగిన వాగ్వివాదం తీవ్ర ఘర్షణకు చోటుచేసుకుంది. గన్ ఫౌండ్రి డివిజన్ లోని రాయల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసుకున్న పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.  శనివారం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి  కేటీఆర్ రోడ్ షో గోషామహల్ నియోజకవర్గం లో ఉండడంతో జన సమీకరణలో భాగంగా రామచందర్ రాజు, దిలీప్ గణాటి ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో దిలీప్ పెనాటి రామచందర్ రాజును దుర్భాషలాడడంతో ఆయన అనుచరులు భవాని మరికొందరు దిలీప్ గానాటేపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో దిలీప్ కనాతకు తీవ్ర గాయమై రక్తస్రావం అయింది. దీంతో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దిలీప్ గణాటే రక్తం సోపాలపై పడడంతో అక్కడే ఉన్న మిగతా కార్యకర్తలు ఇరువురిని సముదాయించి దిలీప్ కు ప్రధమ చికిత్సలు చేశారు. ఈ మేరకు బాధితుడు దిలీప్ గానాటే కుమారుడు సాయి తేజ సుల్తాన్ బజార్ పోలీసులను ఆశ్రయించి మాజీ కార్పొరేటర్ రామచందర్ రాజు, భవానీలపై ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసులు వారిపై 306,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును సుల్తాన్ బజార్ ఇన్ స్పెక్టర్ ముత్తు దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love