రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

నవతెలంగాణ-హైదరాబాద్ : రామోజీరావు యుగపురుషులని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘ఎప్పటినుంచో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రామోజీరావుకు కూడా భారతరత్న వచ్చేలా కృషి చేద్దాం. రాజధానికి అమరావతి పేరును ఆయనే సూచించారు. అందుకే అక్కడ ఆయన పేరిట విజ్ఞాన్ భవన్ నిర్మిస్తాం. ఓ రోడ్డుకు రామోజీ పేరు పెడతాం. విశాఖలో రామోజీ పేరిట చిత్రనగరి, ఎన్టీఆర్ ఘాట్ మాదిరి మెమోరియల్ నిర్మిస్తాం’ అని సంస్మరణ సభలో ప్రకటించారు.

Spread the love