నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ నాయకులు వాఖ్యానించినట్టు సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు, కరెక్టింగ్ మాస్టర్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో నిరుపేదలకు, అర్హులకే సంక్షేమ పథకాలని చెప్పారు. దుబారాకు దూరంగా పథకాల అమలు చేస్తామన్నారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చి, వారి పురోగతికి తోడ్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యతని చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు, రాష్ట్ర అభివృద్ధి రెండు ఈ ప్రభుత్వ ప్రాథమిక సూత్రాలని ఒక ప్రకటనలో తెలిపారు. రైతు భరోసా అలస్యం చేయడానికి కాదు, ఆదర్శం చేయడానికే కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామని తుమ్మల చెప్పారు.