Sunday, May 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఖర్గేతో సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేతల భేటీ

ఖర్గేతో సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేతల భేటీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ మీదుగా గుల్బర్గా వెళ్తున్న సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్, శ్రీహరి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఖర్గే సూచించినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -