నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నేతలపై దాడులు కలకలం రేపుతున్నాయి. పార్టీలో కీలక నేత అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజే, ఈ ఉదయం మరో ఎంపీ సొంత నియోజకవర్గంలోనే దాడికి గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. హుగ్లీ జిల్లాలోని చండీతాలలో ఎంపీ కల్యాణ్ బెనర్జీ పర్యటిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది జనాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే కొందరు ఆయన తలపై కొట్టారు. ఈ అనూహ్య పరిణామంతో ఆయన తల పట్టుకుని కిందపడిపోయారు. ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాడికి ముందు కొందరు వ్యక్తులు కల్యాణ్ బెనర్జీకి నల్ల జెండాలు చూపిస్తూ దొంగ దొంగ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శనివారం దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్‌పూర్‌లో అభిషేక్ బెనర్జీ పర్యటనలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఆయన పర్యటనలోనూ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవగా.. ‘చోర్ చోర్’ అంటూ నినాదాలు చేశారు.
తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై దాడి
- Advertisement -
- Advertisement -



