Monday, May 18, 2026
E-PAPER
Homeజాతీయంరెండ్రోజుల్లో రెండు సార్లు 
 సీఎన్జీ ధర పెంపు

రెండ్రోజుల్లో రెండు సార్లు 
 సీఎన్జీ ధర పెంపు

- Advertisement -

వాహనదారులపై ఇంధన భారం
ఇటీవల రూ.2 పెంపు..మళ్లీ ఇప్పుడు రూపాయి పెంపు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యుడికి సీఎన్‌జీ కంపెనీలు మరో గట్టి షాక్ ఇచ్చాయి. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం దేశీయంగా సీఎన్‌జీ ధరలను మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో పెను భారం పడినట్లైంది. తాజాగా కేజీ సీఎన్‌జీపై మరో రూపాయి చొప్పున ధరను పెంచారు. ఈ పెంపుతో అటు సొంత వాహనదారులు, ఇటు ఆటో, క్యాబ్ డ్రైవర్ల బడ్జెట్ తలకిందులైంది. గడిచిన 48 గంటల్లోనే సిఎన్‌జి ధరలు పెరగడం ఇది రెండోసారి. అంతకు ముందు మే 15న చమురు కంపెనీలు సీఎన్‌జీ ధర కిలో రూ.2 మేర పెంచాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే సీఎన్‌జీ వాహనదారులపై మొత్తంగా మూడు రూపాయల అదనపు భారం పడినట్లయింది.

తాజా పెంపుతో రాజధాని ఢిల్లీలో సీఎన్‌జీ ధర కేజీ రూ.80.09కి చేరింది. ముంబయిలోని 84.09కి చేరింది. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా-గజియాబాద్‌ ప్రాంతంలో ఈ రేటు రూ.88.70గా నమోదు కాగా.. హైదరాబాద్‌లో అత్యధికంగా రూ.100కు చేరింది. పశ్చిమాసియా యుద్ధం, హార్ముజ్ జలసంధిలో విధించిన ఆంక్షల నేపథ్యంలో గ్యాస్‌, చమురు ట్యాంకర్ల రవాణా నిలిచిపోయింది. ఈ పరిణామాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు భారీగా పెరగడంతో, దేశీయంగానూ ఇంధన ధరలను పెంచడం అనివార్యమైంది. నిరంతరం పెరుగుతున్న ఈ ధరలు సామాన్య, మధ్యతరగతి వాహనదారుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ,డీజిల్ లీటర్ పై మూడు రూపాయలు కేంద్రం అదనంగా పెంచేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -