నవతెలంగాణ-రెబ్బెన
ఓపెన్ కాస్ట్‌లో బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సింగరేణిని ప్రయివేటీకరించేందుకు బొగ్గు బ్లాక్‌లను వేలం వేస్తుందన్నారు. దీన్ని వ్యతిరేకిస్తు సంఘం పిలుపు మేరకు ఈనెల 5 నుంచి 18వ తేది వరకు నిరసనలు తెలిపాలని నిర్ణయించడం జరిగిందన్నారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షులు బయ్య మొగిలి, గోలేటి బ్రాంచ్ ఆర్గనైజింగ్ కార్యదర్శులు సముద్రాలు ఆనంద్, శేషశైనారావు, కే కిరణ్ బాబు పాల్గొన్నారు.
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో…
బొగ్గు బ్లాక్ ల వేయడానికి వ్యతిరేకంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. బొగ్గు బ్లాకులను సింగరేణికే నామినేషన్ పద్ధతిపై కేటాయించాలని, కమర్షియల్ మైనింగ్ పేరిట వేలం వేయడాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి టౌన్షిప్‌లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మాల్రాజ్ శ్రీనివాసరావు, సెంట్రల్ కమిటీ నాయకులు ధరావత్ మంగీలాల్, ఓరం కిరణ్, ఏరియా కార్యదర్శి మారిన వెంకటేష్, నాయకులు సుగ్రీవులు, దేవేందర్, బొంగు వెంకటేష్, మారుతి, ఖలీముల్లా ఖాన్, సత్యనారాయణ, బాబురావు పాల్గొన్నారు.