Friday, May 29, 2026
E-PAPER
Homeజాతీయంకాక్రోచ్ జనతా పార్టీ ఖాతా బ్లాక్..ఎక్స్‌కు నోటీసులు

కాక్రోచ్ జనతా పార్టీ ఖాతా బ్లాక్..ఎక్స్‌కు నోటీసులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: జాతీయ భద్రత పేరుతో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అనే వ్యంగ్య ఖాతాను బ్లాక్ చేయడంపై ఢిల్లీ హైకోర్టు ‘X’ (ట్విట్టర్)కు నోటీసులు జారీ చేసింది. ఈ బ్లాకింగ్ ఉత్తర్వులపై పునఃసమీక్ష జరపాలని ఐటీ శాఖ రివ్యూ కమిటీకి హైకోర్టు ఆదేశించింది. వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఈ చర్యను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు.

ఆన్‌లైన్ వేదిక‌గా ‘కాక్రోచ్ జనతా పార్టీ హాల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. నిరుద్యోగుల‌ను కించ‌ప‌రుస్తూ సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి చేసిన వ్యాఖ్య‌ల‌కు వ్య‌తిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీని అభిజీత్ దిప్కే అనే యువ‌కుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా స్థాపించారు. కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే కాక్రోచ్‌కు ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. దీంతో బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. విదేశీ శ‌క్తులు భార‌త్‌లో కుట్ర‌ల‌కు తెర‌లేపార‌ని ఆరోపించారు. అభిజీత్ దిప్కేకు కేంద్ర మంత్రి కిర‌ణ‌ రిజిజు మ‌ధ్య ఎక్స్ వేదిక‌గా మాట‌ల యుద్ధం న‌డిచిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత వెంట‌నే కాక్రోచ్ జనతా పార్టీ ఆంక్ష‌లు విధించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -