ముగిసిన కొబ్బరి వృక్ష మిత్రుల శిక్షణ

– ప్రతిభావంతులకు బహుమతులు, యంత్రాల పంపిణీ
నవతెలంగాణ – అశ్వారావుపేట
కొబ్బరి అభివృద్ధి మండలి ఆర్థిక సహకారంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అశ్వారావుపేట, వ్యవసాయ కళాశాల లో ఆరు రోజులు పాటు 20 మంది కొబ్బరి వృక్ష మిత్రులకు నిర్వహించిన శిక్షణ సోమవారం తో ముగిసింది.ఇందులో శిక్షణ అర్హులకు మాష్టర్ ట్రైనర్ లు రఘు,శ్రీను లు కొబ్బరి వృక్షాలు ఎక్కే యంత్రాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పంపిణీ చేశారు.ఉత్తమ ప్రతిభ కనబలరిచిన పలువురు కు ప్రోత్సాహక బహుబతులు అందజేసారు.ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల శాస్త్రవేత్త,ఇంచార్జి అసోసియేట్ డీన్ఐ. వి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ శిక్షణ అర్హులు అందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి ఆర్థిక పరిస్థితులను మెరుగు పరుచుకోవాలి అని హర్షం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ అధికారి జయమ్మ,అధ్యాపక సిబ్బంది  నాగ అంజలి,రమేష్, పావని, పాల్గొన్నారు.ఈ ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని.ప్రొఫెసర్స్ కే.శిరీష, నీలిమ సమన్వయపరిచారు.
Spread the love