ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ – మల్హర్ రావు
వేసవికాలంలో మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. అన్ని గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదే శాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర పంచాయ తీరాజ్,గ్రామీణాభివృద్ధిశాఖ సంచాలకులు దివ్యదే వరాజన్ ఇటీవల ఉత్తర్వులిచ్చారు.వేసవిలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. సూర్యుడు నిప్పుల కొలిమిలా మారుతుండటంతో జిల్లావ్యాప్తంగా మండలంలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీలు దాటుతున్నాయి.వడ గాలులు,ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లినవారు, ప్రయాణాల వేళ దాహం తీర్చుకునేందుకు పడరానీపాట్లు పడుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతూన్నట్లుగా తెలుస్తోంది. వేసవికాలంలో జనసంచారం ఎక్కువగా ఉండే బస్టాండ్లు, మార్కెట్లు, ప్రధాన చౌరస్తాల్లో తాగునీరు లభించక ప్రజలు అవస్థలు పడుతుంటారు. తప్పనిసరి పరిస్థి తుల్లో వాటర్ బాటిళ్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది.అయితే దినసరికూలీలు,పేదప్రజలు డబ్బులు పెట్టి కొనుగోలు చేయలేక తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వేసవిలో ఎండల తీవ్రత పెరగడంతో అప్రమత్తమైన ప్రభు త్వం వెంటనే గ్రామాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. జనసంచారం ఎక్కు వగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలను గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చింది. అన్ని పంచాయతీల్లో చలివేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లుగా పంచాయతీ అధికారులు చెబుతున్నారు. అయితే చలివేంద్రాలు ప్రారంభోత్సవాలకు పరిమితం కాకుండా వేస వికాలం ముగిసేంతవరకు కొనసాగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.



