ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ 

Collector inspected the MLC election polling stationsనవతెలంగాణ – రాయికల్
పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలుర), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచనలు చేశారు.పోలింగ్ నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, పోలింగ్ కేంద్రాల వద్ద బిఎన్ఎన్ఎస్ యాక్ట్ (144) సెక్షన్ అమల్లో ఉంటుందని ఎవరైనా సరే ఎన్నికల నియమవళిని తప్పనిసరి హ పాటించాలని అన్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు.ప్రతి ఒక్క పట్టభద్రులు,ఉపాధ్యాయులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకువాలి సూచించారు.కలెక్టర్ వెంట తహసిల్దార్ అబ్దుల్ ఖయ్యూం,ఎంపీవో సుష్మ, మున్సిపల్ మేనేజర్ వెంకటి తదితరులు ఉన్నారు.
Spread the love