ప్రజా పంపిణీ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు: కలెక్టర్

– రైస్ మిల్ యజమాని, స్టేజ్ టు కాంట్రాక్టర్, కో కాంట్రాక్టర్ ,ఎస్ డబ్ల్యూ ఎస్  వే బ్రిడ్జి ఆపరేటర్,ఇద్దరు లారీ డ్రైవర్ల పై క్రిమినల్ కేసులు నమోదు
– నల్గొండ గోడౌన్ ఇంచార్జ్ సస్పెండ్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
నల్గొండ ఎం ఎల్ ఎస్  పాయింట్ కి వెళ్లాల్సిన ప్రజా పంపిణీ బియ్యాన్ని పక్కదారి పట్టించిన  స్టేజ్ టు కాంట్రాక్టర్  శ్రీనివాసులు, కో కాంట్రాక్టర్ రమేష్, ఇద్దరులారీ డ్రైవర్లు,తెప్పలమడుగు అమ్మ రైస్ మిల్ యజమాని ఎం .రామాంజులు రెడ్డి ల పై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సోమవారం  నల్గొండ ఎం ఎల్ ఎస్ పాయింట్ కు  వెళ్లాల్సిన ప్రజా పంపిణీ బియ్యం అక్రమంగా హాలియ వద్దనున్న అమ్మ రైస్ మిల్ కు తరలించిన సంఘటన జిల్లా కలెక్టర్ దృష్టికీ రాగానే పౌరసరఫరాల అధికారులు, పోలీస్  అధికారులు  సంఘటన స్థలానికి వెళ్లి  లారీలో ఉన్న  పిడిఎస్ బియ్యం, అలాగే రైస్ మిల్ లో ఉన్న బియ్యం మొత్తం 550 కింటాల్ల బియ్యాన్ని,మరో లారీ లో తీసుకెళుతున్న 275 కింటాల్ ల బియ్యాన్ని మొత్తం 775 కింటాల్ ల బియ్యాన్ని  2 లారీలను AP29TB2385, AP07TD3979  స్వాధీనం చేసుకోవడంతోపాటు, స్టేజ్ టు కాంట్రాక్టర్ శ్రీనివాసులు, కో కాంట్రాక్టర్ రమేష్ తో పాటు ఇద్దరు లారీ డ్రైవర్ల పై క్రిమినల్ కేసులు నమోదు  చేశారు. అలాగే  అమ్మ రైస్ మిల్ ఓనర్ ఎం. రామానుజులు రెడ్డి పై సైతం క్రిమినల్ కేసు నమోదు చేసి ఆ రైస్ మిల్లును బ్లాక్లిస్టులో ఉంచారు. నల్గొండ ఆర్డిఓ రవి, తహసీల్దార్ నివేదిక ఆధారంగా బాధ్యులైన  మర్రిగూడ ఎస్డబ్ల్యూఎస్ గోడౌన్  వే బ్రిడ్జి ఆపరేటర్ పై కేసు నమోదు చేయటమే కాక టెర్మినేట్ చేశారు.అలాగే నల్గొండ గోడౌన్ ఇంచార్జ్ ను సస్పెండ్ చేశారు. జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే  క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, 6 ఏ కేసులు నమోదు  చేస్తామని, ఇకపై ఎవరైనా పిడిఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
Spread the love