ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలి: కలెక్టర్

Prompt response to public issues: Collector– మండల,మున్సిపల్ స్థాయిలలో ప్రజావాణి తప్పక నిర్వహించాలి
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రజా సమస్యల పరిష్కార దిశగా సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో  ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లతతో  కలసి పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని మండలాల తో పాటు మున్సిపాలిటీల లో  ప్రజాసమస్యలపై ప్రజావాణి కార్యక్రమం తప్పక నిర్వహించాలని అలాగే అధికారులు తప్పక పాల్గొనాలని ఆదేశించారు.  జిల్లాలో ని జి.పి లు, మున్సిపాలిటీలలో ఎప్పడికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని, దోమల నివారణకై ఫాగింగ్ చేపట్టాలని సూచించారు.  జిల్లాలో ప్రతి కార్యాలయ పరిధిలో బయో మెట్రిక్ విధానం అమలు చేయాలని, ఉద్యోగులు, సిబ్బంది సమయాపాలన పాటించాలని అలాగే మూమెంట్ రిజిస్టర్, సెలవుల రిజిస్టర్ తప్పక నిర్వహించాలని సూచించారు. జిల్లా స్థాయి ప్రజావాణిలో ఎక్కువగా భూములపై ఎక్కువ దరఖాస్తులు వస్తున్నందున అట్టి దరఖాస్తులను ఆయా మండల తహశీల్దార్లకు సత్వర చర్యలకై పంపించడం జరుగుతుందని అట్టి దరఖాస్తులు వెంటనే పరిష్కారించాలని, కానీ పక్షంలో దరఖాస్తు దారునికి తెలపాలని సూచించారు.ప్రజావాణిలో భూ సమస్యలపై 39 దరఖాస్తులు, డి.ఆర్.డి.ఓ 17, డి డబ్ల్యు ఓ 7, ఇతర శాఖలకు సంబంధించి 16, మొత్తం దరఖాస్తులు 79 అందాయని సంబంధిత శాఖల వారీగా తదుపరి చర్యలకై పంపించడం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో  డిఆర్డీఓ మధుసూదన్ రాజు, సి.పి.ఓ కిషన్,డి.ఈ. ఓ అశోక్, డి డబ్ల్యు ఓ వెంకటరమణ, సంక్షేమ అధికారులు శంకర్, అనసూర్య, జగదీశ్వర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love