నవతెలంగాణ – సూర్యాపేట్ కలెక్టరేట్
ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ స్కీమ్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ నీటి పారుదల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో నీటి పారుదల శాఖ అధికారులతో నీటి నిల్వలు, లభ్యత, భూసేకరణ పనులపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ 68 ఎకరాలలో వెల్లటూరు చింతలపాలెం మండలంలో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ స్కీం భూసేకరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. అదేవిదంగా హూజూర్నగర్ ఎన్ ఎస్ పి క్యాంపులు సంబందించి హద్దులు నిర్ణయంపై కోర్టు ఆదేశాలప్రకారం స్థానిక ఆర్.డి.ఓ, ఈ. ఈ అలాగే తహసీల్దార్ వివరాలు సేకరించాలని సూచించారు.ఈ సమావేశంలో నీటిపారుదల చీఫ్ ఇంజనీర్ ఓ.వి రమేష్ బాబు, ఎస్.సి స్వర్గం నర్సింహ రావు, ఈ ఈ లు శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.