పండుగ వాతావరణంలో పాఠశాలను ప్రారంభించాలి: కలెక్టర్

– 1274  ప్రభుత్వ పాఠశాలలో ఏకరూప దుస్తులు,పుస్తకాల పంపిణీ..
– ప్రతి పాఠశాల ఆద్దంలా మేరవాలి..
నవతెలంగాణ  – సూర్యాపేట కలెక్టరేట్
పండుగ వాతావరణం ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. మంగళవారం వబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సిహెచ్ ప్రియాంకతో కలిసి కలెక్టర్ వెబ్ఎక్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ పాఠశాల పరిశుభ్రంగా ఉంచాలని, ఆన్ని పాఠశాలలు ఆద్దంలా  మేరవాలి, మండల పరిధిలో ప్రజా ప్రతినిధులు ఆహ్వానించి పాఠశాలలలో ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలల వద్ద స్వాగత  ద్వారాలు ఏర్పాటు చేయాలి , పండుగ వాతవరణం కనిపించాలి. మున్సిపల్ పరిధిలోని పాఠశాలలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆహ్వానించి దుస్తులు పుస్తకాలు పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం స్వయం శక్తి సంఘాలతో దుస్తుల కుట్టించి పంపిణీ చేస్తుందని, సంఘాలను ఆర్థికంగా ఎదగడానికి  ప్రభుత్వం వారికి ఈ  ఎకరూప దుస్తుల తయారీని వారికి ఇచ్చిందని ఇట్టి విషయాన్ని అన్ని పాఠశాలలో పంపిణీ అనంతరం అందరికీ తెలిసే విధంగా తెలపాలన్నారు. ఎంఈఓ లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మండల స్పెషల్ ఆఫీసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు.13వ తారీకున మందిరాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని ఏబీఎంలో అంగన్వాడీలు ఆశ వర్కర్లను ఏ అవగాహన కార్యక్రమంలో పాల్గొని విధంగా చేసి డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల యొక్క లార్వాదశ గురించి వారికి అవగాహన పొందేలా తెలపాలని కలెక్టర్ పేర్కొన్నారు అన్నిచోట్ల మస్కిటో ఫాగింగ్ జరపాలని మహిళా సంఘాల ద్వారా ఆయిల్ బాల్స్ తయారీ చేపట్టాలని దీనికొరకు తకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బడిబాట కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టి కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని అన్నారు .కోంత మంది ఎంపీడీవో లు సరిగా స్పందిచడంలేదని పిర్యాదులు వస్తున్నాయని వారు జాగ్రత్త గా విధులు నిర్వహించాలని తేలిపారు. ఈ విడియే కాన్ఫరెన్స్ లో ఆర్డీవో,తహసిల్దార్, ఎంఈఓ, ఎంపీడీవో, ఎంపీ ఓ, లు పాల్గొన్నారు.
Spread the love