
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో ఆత్మకూర్ (ఎస్ ) పేరుకే పెద్ద మండలం కానీ ఏ ఊరికి కూడ బస్ సౌకర్యం లేదంటే నమ్మచ్చాక్యం కాదు. ఈ మండలం లో చుట్టు పక్కన ఉన్న గ్రామాల నుండి మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హాస్టల్ లు ఉన్న ఇక్కడ బస్ సౌకర్యం లేక ఆడ పిల్లలు చదువుకు దూరం అయ్యో పరిస్థితి ఏర్పడిందని, ఆ మండలానికి చెందిన బాలికలు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమైక్య బాలికలసంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు కు వివిధ డిమాండ్ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాలికలు మాట్లాడుతూ.. కనీసం ఈ ఊర్లలో ఆటో సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు. ఆత్మకూర్ (ఎస్ )గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించి పునరుద్ధరించాలని కోరారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇంటర్, డిగ్రీ విద్యార్థులు విద్యాబ్యాసానికి దూరమవ్వాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామనిజిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి డిపో మేనేజర్ తో మాట్లాడి బస్ ఏర్పాటు చేస్తానని తెలిపారు.డిపో మేనేజర్ శ్రీనివాసులు బస్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమైక్య జిల్లా అధ్యక్షులు ఎం శ్రీజ, ఉపాధ్యక్షులు కుసుమ శ్రీ , కోశాధికారి మనీషా, భవాని, మాధవి, అభి శ్రీ, శ్రావణి, మహేశ్వరి, అఖిల, సమీనా, లావణ్య యం. వి. పౌండేషన్ బాధ్యులు వి. లలిత, సైదులు తదితరులు పాల్గొన్నారు.