నులి పురుగుల నియంత్రణపై టాస్క్ ఫోర్స్  మీటింగ్ నిర్వహించిన కలెక్టర్

Collector who conducted task force meeting on pest controlనవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
నులిపురుగుల నియంత్రణ కార్యక్రమముపై కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు జిల్లా టాస్క్ ఫోర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమములో 01 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆల్బెండజల్ మాత్రలు అందజేయాలన్నారు. జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 01 నుంచి 19 ఏళ్లవారికి ఆల్బెండైజర్ మాత్రలు వేయాలని ఈనెల 10.02.2025 నాడు తేదీన నిర్వహిస్తున్న జిల్లా నులిపురుగుల దినోత్సవంలో పిల్లలందరికీ ఆల్బెండజలు మాత్ర మింగించడానికి తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు, జిల్లాలో 1,50,704 మందికి పిల్లలకు ఈ మాత్రలు వేయాలని 01 నుంచి 02 సంవత్సరాల మధ్య చిన్నారులకు సగం మాత్ర పొడిచేసి పాలు లేదా నీటిలో కలిపి తాగించాలి, 02 సంవత్సరాల నుండి 03 సంవత్సరాల పిల్లలకు ఒక మాత్ర పొడిచేసి త్రగించాలి. 03 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల పిల్లలకు ఒక మాత్ర మింగించాలన్నారు. పిల్లలలో రక్తహీనత పోషకాహార లోపము నివారించడానికి ఇది దోహదపడుతుందన్నారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. మనోహర్ గారు, తెలియజేసారు. ఈ నెల 10.02.2025 నాడు తేదీన నిర్వహిస్తున్న జిల్లా నులిపురుగుల దినోత్సవంలో మిగిలిన పిల్లలకి తేది: 17.02.2025 నాడు మాపప్ రౌండ్ లో వేయడం జరుగుతుందనారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో  ప్రోగ్రాం అధికారి  డా. రామకృష్ణ,  డిప్యూటీ డిఎంహెచ్వోలు  డా.శిల్పిని, డా. యశోద, ప్రోగ్రాం ఆఫీసర్స్ డా.సాయి శోభ, డా.రామకృష్ణ, డా. సుమన్ కళ్యాణ్, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డి.సి.హెచ్.ఎస్ డా. చిన్న నాయక్, గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్ డా. రాజారావు, డా. మాలతి స్త్రీ వైద్యనీపునులు, డా. కవిత పిల్లల వైద్యనీపునులు, డా. పాండు మత్తు వైద్యనీపునులు  జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటి మెంబర్స్, జిల్లా విద్యాధికారి, జిల్లా వెల్ఫేర్ అధికారి, జిల్లా రూరల్ డెవలప్మెంట్ అధికారి, మునిసిపల్ కమీషనర్స్ పాల్గొన్నారు.
Spread the love