నష్టపరిహారం చెల్లించాలి: ఆయిల్ ఫాం సొసైటీ

నవతెలంగాణ – అశ్వారావుపేట
జన్యు లోపం మొక్కలు సరఫరా చేసి రైతులకు అవి గెలలు రాకపోవడంతో ఏళ్ళ తరబడి రైతులు నష్టపోతారని,దీన్ని దృష్టిలో ఉంచుకుని బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలనితెలంగాణ స్టేట్ ఆయిల్ఫెడ్ అశ్వారావుపేట జోన్ పామాయిల్ సాగు దారులు( గ్రోవర్స్) సొసైటీ ఆయిల్ఫెడ్ ను డిమాండ్ చేసింది.ఈ సొసైటీ విస్త్రుత స్థాయి సమావేశం ఆదివారం తుంబూరు ఉమామహేశ్వర రెడ్డి అధ్యక్షతన స్థానిక కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర రెడ్డి,పుల్లయ్య లు మాట్లాడుతూ పలు డిమాండ్ లను పత్రికా ముఖంగా వ్యక్తం చేసారు.పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయిల్ఫెడ్  యాజమాన్యం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొన్నింటిని పరిష్కరించుకున్నామని అన్నారు. మిగిలిన సమస్యలు సైతం స్వతహాగా పామాయిల్ రైతు అయిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా కలిసి పరిష్కరించమని కోరతామన్నారు.అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో పామాయిల్ గెలలు ను క్రషింగ్ చేసి ఓ ఈ ఆర్ నిర్ధారించే మిల్లును ఏర్పాటు చేయాలని కోరారు.పామాయిల్ సాగుపై రైతులకు శిక్షణ,ఆయిల్ ఫాం పరిశోధనా కేంద్రాన్ని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు అనుబంధంగా నెలకొల్పాలని అన్నారు.
పామాయిల్ సాగుకు అవసరమైన అన్ని రకాల సాగు సామాగ్రి( పరికరాలు) రాయితీ పై ఇవ్వాలని కోరారు.
ఆయిల్ఫెడ్ నర్సరీల నుంచి ఇచ్చిన జన్యు లోపం, హాఫ్ టైప్, నాసిరకం మొక్కలకు నష్ట పరిహారం తో పాటు ఉచితంగా మొక్కలు,రాయితీలు ఇవ్వాలన్నారు.భూమికి రికార్డులు లేని రైతులకు సైతం రాయితీపై పామాయిల్ మొక్కలు, మూడేళ్ల పాటు రాయితీ ఇవ్వాలన్నారు.పోడు భూములకు నీటి వసతి,డ్రిప్ వసతి కల్పించాలన్నారు.2019 నుంచి పామాయిల్ మొక్కలు ఇచ్చిన రైతులకు రాయితీ బకాయిలను విడుదల చేయాలని కోరారు.ప్రతి నెల గ్రామాల వారీగా రైతులకు పామాయిల్ సాగుపై శిక్షణ, అవగాహన కల్పించాలని కోరారు.
ఈ సమావేశంలో దారా తాతారావు, ఆళ్ల నాగేశ్వరరావు,జలసూత్రం శివరామ్ ప్రసాద్, చెలికాని సూరిబాబు,ఇనుగంటి రాంబాబు,శెట్టి వినోద లు పాల్గోన్నారు
Spread the love