Sunday, September 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం

యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం

- Advertisement -

ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి
కాటారం డీఎస్పీ ఏ.సూర్యనారాయణ
నవతెలంగాణ – మల్హర్ రావు

యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని కాటారం డీఎస్పీ ఏ.సూర్యనారాయణ అన్నారు. ఆదివారం కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్‌లో జిల్లా యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జనగామ కరుణాకర్ రావు,జిల్లా అథ్లెటిక్స్ చైర్మన్ పంతకాని సమ్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన పోటీల బహుమతి ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ వయస్సు కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలు బంగారు,రజత,కాంస్య పతకాలను అందజేశారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చిన్న వయస్సు నుంచే పిల్లలు యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మనస్సును ప్రశాంతంగా ఉంచి ఒత్తిడిని తగ్గించేందుకు దోహదపడే సాధనమని పేర్కొన్నారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, యోగాపై కూడా ఆసక్తి పెంచుకోవాలని, తద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని అన్నారు. జిల్లా స్థాయిలో ఇలాంటి పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో యోగా పట్ల మరింత ఆసక్తి, పోటీతత్వం పెరుగుతుందని తెలిపారు. అంతకుముందు జిల్లా స్థాయి యోగాసన పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి సర్పంచ్ పంతకాని సడవలి, ఏఎంసీ చైర్ పర్సన్ పంతకాని తిరుమలసమ్మయ్య, సిడిపిఓ రాధిక, ఎస్సై శ్రీనివాస్ లు ప్రారంభించారు. కార్యక్రమంలో యోగా అసోసియేషన్ సెక్రెటరీ ఆత్మకూరి కుమార్ యాదవ్, జనరల్ సెక్రెటరీ బుడిమే కుమార్, యోగా గురూజీలు వావిళ్ళ కిష్టయ్య, వావిళ్ళ మహేందర్, ఎడ్ల మధు, ఎడ్ల రాము, గౌరోజు సదానందం, కుమార్ యాదవ్, శ్రీనివాస్, వనిత, గోపాల్, మీనా, శ్రీలత రెడ్డి, డాక్టర్ రఫీ, రాజబాపు,నాగరాజు విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -