Sunday, September 6, 2026
E-PAPER
Homeఆదిలాబాద్అడ ప్రాజెక్టు కుడికాలువకు మరమ్మతులు చేయాలి 

అడ ప్రాజెక్టు కుడికాలువకు మరమ్మతులు చేయాలి 

- Advertisement -

నవతెలంగాణ-ఆసిఫాబాద్ 
రోజురోజుకు కుంగిపోతు మాణిక్ గూడ ప్రజల ఇబ్బందులకు కారణం అవుతున్న అడ ప్రాజెక్టు కుడికాలువకు వెంటనే మరమ్మతులు చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి గోడిసెల కార్తీక్ డిమాండ్ చేశారు. నాయకుల తో కలిసి కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు చూపు లేకుండా మరమ్మతులు చేయడంతో ప్రజాధనం వృధా అయ్యిందన్నారు. కాలువ కుంగిపోయి గ్రామానికి ముప్పువాటిల్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రాజెక్టు పరిస్థితి అయోమయంగా తయారు కాలువ పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. ఇన్చార్జి మంత్రి కనీసం కాలువను పరిశీలించే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలతో పాటు జిల్లా అధికారుల స్పందించి కాల్వకు మరమ్మతులు చేయాలని గ్రామ ప్రజల కష్టాలు తీర్చాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కోశాధికారి దుర్గం నిఖిల్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -