నవతెలంగాణ – మల్హర్ రావు
పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో మానేరు ఒడ్డున ఉన్న 750-1323 మధ్య కాకతీయ రాజుల కాలంనాటి పురాతన చంద్రవెళ్లి ఆలయాల్లో సీతారాముల కళ్యాణ మహోన్నత వేడుకలను ఆదివారం ఉదయం 11.25 గంటలకు పురోహితులచే నిర్వహించడానికి సర్వం ఏర్పాట్లు సిద్ధం చేసినట్లుగా ఆలయ చైర్మన్ ఇందారపు లక్ష్మీ, వైస్ ఛైర్మన్ చిలుక రాధిక లు తెలిపారు. ఈ మహోత్సవం తిలకించడానికి చుట్టూ ప్రక్కల గ్రామాల సందర్శకులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆహ్వానించారు.