సీఎం రేవంత్ రెడ్డితోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి 

– మహబూబాద్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి 

నవతెలంగాణ – నెల్లికుదురు 
తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోనే తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని మహబూబాద్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కంకర అయ్యప్ప రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ పార్లమెంటు అభ్యర్థి పోరిక  బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించడం వల్ల హర్ష వ్యక్తం ప్రకటిస్తూ టపాసులు కాచే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడం కోసమే ఈ ప్రాంత ప్రజలు ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించారని మరియు ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే అని సీఎం ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై మహబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలు ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ పట్టణం కట్టారని అన్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించుకున్నారు బలరాం నాయక్ తోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నపురం యాకయ్య పులి వెంకన్న కుమ్మరి కుంట్ల మౌనేందర్ వరిపల్లి పూర్ణచందర్ మహమ్మద్ మౌలానా మల్లేష్ పిట్టల మురళి గుండ్లపల్లి యాకన్న వెన్నం క్రాంతి రెడ్డి కిషన్ నాయక్ నరసయ్య కొమురెల్లి తోపాటు వివిధ గ్రామాల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love