కామ్రేడ్ సంగు రవన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం..

Comrade Sangu Ravanna's ambitions will be carried forward..నవతెలంగాణ  – భువనగిరి
భువనగిరి విద్యార్థి సీపీఐ(ఎం) సిద్ధాంతాల కోసం పనిచేసిన సంగు రవన్న ఆశలు ముందు తీసుకెళ్తామని రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ  తెలిపారు. శనివారం స్థానిక సుందరయ్య భవన్లో సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సంగు రవీందర్ పదోవర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. భువనగిరి పట్టణంలో ప్రజాసంఘాలలో డివైఎఫ్ఐ ప్రజానాట్యమండల్లో ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పనిచేశారన్నారు. విద్యార్థి ఉద్యమాలలోకి, పార్టీలోకి    యువకులకు విద్యార్థులను తీసుకురావడంలో కీలక భూమిక పోషించారన్నారు. శ్రమదోపిలి లేకుండా పేద ప్రజలను కాపాడడం దోపిడీ లేని రాజ్యం కోసం పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ సభ్యులు మాటూరు బాలరాజు కల్లూరు మల్లేశం సీనియర్ నాయకులు గద్దె నరసింహ, పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, పట్టణ కార్యవర్గ సభ్యులు వనం రాజు, వోల్ దాస్ అంజయ్య,  నరసింహ, రాంబాబు  పాల్గొన్నారు.
Spread the love