ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వ దాడులను ఖండించండి

– ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌
నవతెలంగాణ-గోదావరిఖని:
భారత ప్రభుత్వం ఆదివాసీలపై జరుపుతున్న దాడులను తక్షణమే రద్దు చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఈసంపల్లి రాజేందర్‌ అధ్యక్షతన జరిగిన ఐఎఫ్‌టీయూ పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశంలో శ్రీనివాస్‌ మాట్లాడుతూ నక్సలైట్ల సాకుతో స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్‌ సంస్థలకు ప్రధానంగా ఆదానీ, అంబానీలకు నిక్షిప్త ఖనిజ సంపదను దోచి పెట్టడానికి, వారికి ఆర్థిక ప్రయోజనాలను సమకూర్చే లక్ష్యంతో ఆపరేషన్‌ కగార్‌ పేరుతో ఆదివాసీలను వేరువేసే ప్రక్రియలో భాగంగా 2024 జనవరి నుండి నేటి వరకు 120 మంది ఆదివాసి గిరిజన ప్రజలను కేంద్ర ప్రభుత్వం హత్య చేసిందని ఆరోపించారు. అదివాసీలను మావోయిస్టు పార్టీకి చెందిన వారిని దారుణంగా హత్య చేసి ఎదురు కాల్పుల పేరిట ప్రకటించడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షులు ఈసంపల్లి రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి ఈదునూరి రామకష్ణ, ఉపాధ్యక్షలు గుండెటి మల్లేశం, కోశాధికారి నాగ బూషణం, సహాయ కార్యదర్శి పుట్ట పాక స్వామి, జిల్లా కమిటీ సభ్యులు సంబోజి ప్రసాద్‌, రాజనర్సు, చింతల శేఖర్‌ పాల్గొన్నారు.

Spread the love