పంజాబ్ రైతులపై హర్యానా పోలీసుల దాడిని ఖండించండి

నవతెలంగాణ – నూతనకల్
పంజాబ్ రైతులపై హర్యానా  పోలీసులు చేసిన కాల్పులను  సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కుందాల శంకర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించాడు. హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో హర్యానాకు చెందిన పోలీసులు  జరిపిన కాల్పుల్లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన బటిండా జిల్లాలోని బాలన్ గ్రామానికి చెందిన 24 సంవత్సరాల యువరైతు శుభకరన్ సింగ్ మరణించాడని పేర్కొన్నారు. కాల్పులకు జరిపిన  సంబంధిత హర్యానా పోలీసులను వెంటనే హత్యా నేరం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కాల్పుల సంఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతులు పండించిన (పంటకు ఎం.ఎస్.పి ) పంటలన్నింటికీ కనీస మద్దతు ధర ఉత్పత్తి వ్యయంపై ఒకటిన్నర రేట్లు చెల్లించాలని, రుణ విమోచన చట్టం తీసుకురావాలని, విద్యుత్ సవరణ బిల్లు ద్వారా విద్యుత్తు రంగ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని, కౌలు రైతులకు తగిన రక్షణ కల్పించాలని, మూడు వ్యవసాయ సాగు చట్టాలను బేసిగాఉపసంహరించుకోవాలనికోరారు.
Spread the love