స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ

Conduct of elections in a free environment– సీ-విజిల్‌ యాప్‌పై విస్తృత ప్రచారం చేయాలి
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పీ.ప్రావీణ్య
నవతెలంగాణ-వరంగల్‌
జిల్లాలో ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం మార్గ దర్శకాల మేరకు స్వే చ్ఛాయుత, ప్రశాంత, పారదర్శక వాతావ రణంలో నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకొంటున్నామని జిల్లాఎన్నికల అధి కారి, కలెక్టర్‌ పి.ప్రావిణ్య పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మంది రంలో జరిగిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని నర్సంపే ట, వర్ధన్నపేట, వరంగల్‌ తూర్పు నియో జకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారుకాగా వారికి గుర్తులు కూడా కేటా యించడం జరిగిందన్నారు. జిల్లాలో ని మూడు నియోజకవర్గాల్లో 87 మంది అ భ్యర్థులు నామినేషన్‌ వేయగా 70 అభ్య ర్థుల నామినేషన్లు ఆమోదించామని 11 మంది అభ్యర్థులు నామినేషన్‌లను ఉప సంహరించుకోగా, పోటీలో 59మంది ఉ న్నట్లు వివరించారు. అందులో నర్సం పే ట నుండి 16 మంది, వరంగల్‌ తూ ర్పు నుండి 29 మంది వర్ధన్నపేట 14 మం ది ఎన్నికలబరిలో ఉన్నారన్నారు. అభ్యర్థు లకు ఎన్నికల పోటీచేసే గుర్తులను కూ డా కేటాయించడం జరిగిందన్నారు. వ రంగల్‌ తూర్పు, నర్సంపేట నియోజకవ ర్గాలకు ప్రతి పోలింగ్‌ కేంద్రానికి రెండు ఈవీఎంల చొప్పున, వర్ధంపేట నియోజ కవర్గం ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక ఈ వీఎంను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2023 నవంబర్‌ 10 తుది ఓటర్ల జాబి తా ప్రకారం జిల్లాలో 7,56,012 ఓట ర్లు, 359 మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నా రన్నారు. నర్సంపేటలో 2,32,179 మం ది ఓటర్లు, వరంగల్‌ తూర్పు నియోజక వర్గంలో 2,54, 641 ఓటర్లు వర్ధన్నపేట లో 2,69,192 ఓటర్లు ఉన్నారన్నారు. 283 పోలింగ్‌ కేంద్రాలు నర్సంపేటకు, 230 పోలింగ్‌ కేంద్రాలు వరంగల్‌ తూ ర్పుకు, 278 వర్ధన్నపేటకు పోలింగ్‌ కేం ద్రాలను ఏర్పాటుచేసి ఓటర్లు, దివ్యాంగు లు, సౌకర్యవంతంగా ఓటు వేసేలా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో మూడు నియోజకవర్గాలకు 791 పోలింగ్‌ కేంద్రాల్లో 210 కేం ద్రా లను అందులోనర్సంపేటలో 90 వరంగ ల్‌ తూర్పులో 57, వర్ధన్నపేట నియోజక వర్గంలో 63 సమస్యాత్మకంగా గుర్తించి లైవ్‌ వెబ్‌ కాస్టింగ్‌, అధిక భద్రత సిబ్బంది ద్వారా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుం టున్నామన్నారు.
ఈనెల 30న జరిగే పోలింగ్‌కు సుమారు 4300 మంది పోలింగ్‌ సిబ్బం దిని కేటాయించి మొదటి శిక్షణ, రండమై జేషన్‌ పూర్తయిందని, రెండవ ర్యాండమై జెషన్‌ చేసి నియోజకవర్గాల స్థాయిలో రెండవ దఫా శిక్షణ నిర్వహిస్తామన్నారు. మోడల్‌ కూడా కండక్ట్‌ను పకడ్బందీగా అమలు చేస్తూ జిల్లాలో 30 ఎఫ్‌ఎస్‌టి, 9 ఎస్‌ఎస్‌టి, 8 వీఎస్‌టి బృందాల ద్వా రా నిత్యం నిఘా ఉంచడం జరుగుతు న్న దన్నారు. ఇప్పటివరకు నర్సంపేటలో రూ.1,10,80,553లు వరంగల్‌ తూర్పు లో రూ. 1,20,37,918లు, వర్ధన్నపేట నియోజకవర్గంలో రూ.1,71,90,087 లు విలువగల బంగారం, గాంజా, లిక్కర్‌ ఇతర వస్తువులను సీజ్‌చేయడం జరిగిం దన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ని ఉల్లంఘించిన వారిపై 23 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. యడం జరిగిందని అన్నారు.
జిల్లా కలెక్టరేట్లో సమగ్ర కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబం ధించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందన్నారు. 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌కు 261 ఫిర్యాదు లు రాగా, వాట్సాప్‌ ద్వారా 5, సి విజిల్‌ ద్వారా 72, సోషల్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా 9, రాతపూర్వకంగా 10 మొత్తం 357 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్క రించడం జరిగిందన్నారు. ఈనెల 17 నుండి 24 వరకు బీఎల్‌వోల ద్వారా ఇం టింటికి ఓటర్‌ సమాచార స్లిప్స్‌ పంపిణీ చేస్తున్నట్లు ఓటర్‌ స్లిప్‌ లలో ఓటరు తన ఓటు హక్కును ఏ పోలింగ్‌ స్టేషన్కు వెళ్లి వినియోగించుకోవాలో మ్యాప్‌, లోకేషన్‌ సమగ్ర సమాచారం అందులో ఉంటుం దని తెలిపారు. మీడియా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌ కమిటీ ద్వారా వివిధ దిన పత్రికల్లో ప్రచురితమైన 9 పెయిడ్‌ న్యూ స్‌ లను గుర్తించినట్లు తెలిపారు.
ఫారం-12 డి క్రింద 80 ఏళ్లు పైబడిన ఓట 506 మంది, 128 మం ది పిడబ్ల్యూడి ఓటర్లకు ముందుగా ఓటు వేసే సౌకర్యం కల్పిస్తు న్నట్లు తెలిపారు. ఎన్నికలలో విధులు నిర్వహించే ఉద్యోగు లకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 596 మంది ఫామ్‌ 12 ద్వారా నమోదు చేసుకున్నా రని వారం దరికీ ఓటు హక్కు కల్పిస్తున్న ట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూ టీ డీఈఓ, ఆర్డీఓ వాసు చంద్ర జిల్లా పౌ ర సంబంధాల అధికారి ఆయుబ్‌ అలీ, ఎ న్నికల పర్యవేక్షకులు విశ్వ న్నారాయణ త దితరులు పాల్గొన్నారు.

Spread the love