
విద్యాశాఖకు మంత్రిని కేటాయించని కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ ) స్థానిక నాందేవాడలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్ హాజరై మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విస్మరణకు గురైన విద్యారంగం అభివృద్ధి అవుతుందనుకుంటే. రేవంత్ రెడ్డి సర్కార్ భిన్నంగా విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవడం బాధాకరమని అన్నారు. విద్యా శాఖకు మంత్రి లేకపోతే విద్యాశాఖకు సంబంధించిన అంశాలపై రివ్యూ లేకుండానే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్న ఇది అప్రజాస్వామి కమనీ అన్నారు. అదేవిధంగా ఒకపక్క విద్యార్థులు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ పై పోరాటాలు నిర్వహిస్తే ప్రభుత్వం నిర్బంధించడం సబబు కాదని ఆయన డిమాండ్ చేశారు. విద్యారంగంన్నీ సమీక్షించని ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేదని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం కాకుండా ఇంటర్ విద్యాశాఖ అధికారుల పొద్బలంతో కళాశాలను అడ్మిషన్లు చేస్తున్నాయని వాటిని నివారించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్న పట్టనట్టు వివరించడం దారుణం అని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర యూనివర్సిటీలకు వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలని అడిగితే 500 కోట్ల కేటాయించడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దీపిక, విగ్నేష్, జిల్లా ఉపాధ్యక్షులు దినేష్, నగర కార్యదర్శి చక్రి యూనివర్సిటీ అధ్యక్షులు శివ తదితర నాయకులు పాల్గొన్నారు.