కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండల కేంద్రంలో సోమవారం రోజున కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాల విషయంలో తెలంగాణ అన్యాయం చేసింది కేసీఆర్ అని, ఆంధ్ర నాయకులతో కుమ్మక్కై కృష్ణా జిల్లాలను ఆంధ్రకు తరలించిన దౌర్భాగ్యుడు కేసీఆర్ అని తెలంగాణ ప్రజల మధ్య ఈ ముఖం పెట్టుకొని నల్గొండ సభ నిర్వహిస్తున్నాడు. దయ్యాలే వేదాలు వల్లించినట్టుందని అధికార దాహంతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వేల కోట్లకు పడగలెత్తాడని ఆయన లాగానే, అల్లుడు కొడుకు కూడా నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి కనీసం వంద రోజులు పూర్తి  కాకుండానే విమర్శలు చేస్తున్నాడని, ప్రతిపక్షం అంటే హుందగా ఉండాలని ప్రభుత్వానికి గౌరవప్రదమైన సూచనలు చేయాలి తప్ప  చిల్లర రాజకీయాలు చేయవద్దని, నీ పద్ధతి మార్చుకోకపోతే వచ్చే పార్లమెంటు ఎలక్షన్లో మీ కుటుంబ పార్టీ భూస్థాపితం అవుతుందని. పోయిన ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా మార్పు రాలేదని, ఉద్యమకారులను అనిచివేసిన ఘనత నీదని నీ పిచ్చి చేష్టలను తెలంగాణ ప్రజలు నమ్మరని, అధికారం కోల్పోయాక పిచ్చోడిలాగా వ్యవహరిస్తున్నాడని, రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇంకా పది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయి రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి, టీపీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, సతీష్ రెడ్డి సవీన్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love