నిరుపేద విద్యార్థికి కాంగ్రెస్ నాయకులు ఆర్థిక సాయం..

నవతెలంగాణ – తాడ్వాయి
బాగా కష్టపడి చదివి ఎన్ఐటి సూరత్కల్ కర్ణాటకలో సీటు సాధించిన అనుముల శ్రీకాంత్ పేద విద్యార్థికి మంత్రి సీతక్క ఆదేశాల మేరకు తాడ్వాయి పిఏసీఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో‌ కాంగ్రెస్ పార్టీ ఊరట్టం గ్రామ కమిటీ అధ్యక్షులు కోటే నరసింహులు అధ్యక్షతన నాయకులు బత్తిని రాజ్ గౌడ్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరీల వెంకన్న లు సోమవారం శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాలు కప్పి సత్కరించి, ఐదువేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతంలోని ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో గల కొత్తూరు (జంపంగవాయి) గ్రామంలో ని వసించి అత్యున్నతమైన ఎన్ఐటి సూరత్కల్ కర్ణాటక లో శ్రీకాంత్ సీటు సంపాదించడం గర్వకారణం అన్నారు. అందరూ విద్యార్థి లోకం శ్రీకాంత్ ను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రీకాంత్ కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడారం మాజీ  గ్రామ కమిటీ అధ్యక్షులు అట్టం సమ్మయ్య , జంగా వెంకట్రామిరెడ్డి , యువజన కాంగ్రెస్ నాయకులు కడారి శేఖర్, నడిగోటీ సురేందర్, సోషల్ మీడియా మండల ఇంచార్జి గజ్జెల రాజశేఖర్, తోట రమేష్ , నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love