పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునేలా కాంగ్రేస్ నాయకులు పనిచేయాలి

నవతెలంగాణ – తిరుమలగిరి
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో నవంబర్ 1 2020 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారందరూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకునేలా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి పని చేయాలని తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్ అన్నారు. శుక్రవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకున్న వారు సైతం తిరిగి ఆన్లైన్ ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. ఆఫ్ లైన్లో  నమోదు చేసుకునే వారు ఫారం  18 పూర్తి చేసి ఒక ఫోటోతో సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్ జిరాక్స్ సాధారణ ఓటు హక్కు  జిరాక్స్ తో జతపరిచి తాసిల్దార్ కార్యాలయంలో ఇవ్వాలని తెలిపారు. ఓటు హక్కు ఫిబ్రవరి 6వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఆన్లైన్ ద్వారా యధావిధిగా ఓటు హక్కు నమోదు చేసుకునేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమీలాల్,మాజీ వైస్ ఎంపీపీ సుంకరి జనార్ధన్, మండల కాంగ్రెస్ నాయకులు కందుకూరి లక్ష్మయ్య, కౌన్సిలర్ బత్తుల శ్రీను, రాపాక సోమేశ్, కేతిరెడ్డి సతీష్ రెడ్డి,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుర్ర శ్రీను, తొండ గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు,మాసంపల్లి మోహన్,గడ్డి దిలీప్, సోమ్లా నాయక్, మహేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love