నవతెలంగాణ-రాయపోల్ : రాయపోల్ మండలానికి నూతన తహసీల్దారుగా శ్రీనివాస్ బుధవారం బాధితులు చేపట్టగా మండలంలోని కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ రాయపోల్ మండల అధ్యక్షులు తప్పటి సుధాకర్ అన్నారు. బుధవారం తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీనివాసులు పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తహసీల్దారుగా పనిచేసిన దివ్య కొమురవెల్లి మండలం బదిలీపై వెళ్లారు. అలాగే కలెక్టర్ కార్యాలయంలో భూసేకరణ విభాగంలో పనిచేసిన శ్రీనివాస్ రాయపోల్ నూతన తహసీల్దారుగా బదిలీపై వచ్చారని ఆయనను రాయపోల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి ఆహ్వానం పలకడం జరిగిందన్నారు. మండలంలోని రైతులు విద్యార్థులు సమస్యలను సత్కరమే పరిష్కరిస్తూ ఎల్లప్పుడూ మండల ప్రజలకు అధికారులు ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని అధికారులు రాజకీయ నాయకులు సమన్వయంతో పనిచేస్తూ మండలాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సిందం శేషికాంత్, సీనియర్ నాయకులు సత్తుగారి కిష్టారెడ్డి, గొల్లపల్లి మహేష్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు తుడుం ప్రశాంత్, పాపని నరేష్, యూత్ కాంగ్రెస్ మండల కార్యదర్శి తుడుం ఇంద్రకరణ్, కార్యకర్తలు నవీన్ తదితరులు పాల్గొన్నారు.