అన్వేష్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు 

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
తెలంగాణా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సుంకేట అన్వేష్ రెడ్డిని మంగళవారం మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినందుకు సుంకేట అన్వేష్ రెడ్డికి  పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.తెలంగాణారాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, మైనార్టీ సెల్ జిల్లా నాయకులు అబ్దుల్ రఫీ, తదితరులు ఉన్నారు.
Spread the love