కాంగ్రెస్‌ పార్టీ మత రాజకీయాలు చేయదు

నవతెలంగాణ-సిద్దిపేట
కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు కూడా మత రాజకీయాలు చేయదని, అలాంటి దానిని కూడా ప్రోత్సహించదని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆత్తు ఇమామ్‌ అన్నారు. మంగళవారం సిద్ధిపేటలో ఆయన్‌ మాట్లాడుతూ రంజాన్‌ వేడుకలను ఈద్గా మైదానం లో ఎప్పటిలాగే నిర్వహించాలని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి తంజీంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. కొందరు తంజీం నాయకులు కావాలని కాంగ్రెస్‌ పార్టీపై బద్నాం చేయడానికి పనిచేస్తున్నారని అన్నారు. తంజీం పై కోర్టు ఇచ్చిన తీర్పు దానిని మేము స్వాగ తిస్తామన్నారు. కొందరు తంజీం నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి పెత్తనం కోసం కొట్లాడుకోవడం సిగ్గుచేటుగా ఉందన్నారు. వారి స్వార్థం కోసం పనిచేస్తున్నారని, అలాంటి వారిని తంజీమ్‌ నుంచి శాశ్వతంగా దూరంగా ఉంచాలని అన్నారు. గత 40 సంవత్సరాల నుండి ఈద్గాలో నమాజ్‌ చదివిస్తున్న పెద్దలనే కొనసాగించాలని, సెలక్షన్‌ కి ఎలక్షన్‌ కి ఏదైనా గొడవలు ఉంటే పండుగ తర్వాత పరిష్కరించుకోవాలని సూచించారు. పండుగ నమాజ్‌ వాతావరణాన్ని వివాదాల్లోకి గురి చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు గయాజుద్దీన్‌, ఎన్‌ ఎస్‌ యు ఐ సిద్దిపేట జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రశాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love