
నవతెలంగాణ- బొమ్మలరామారం
బొమ్మలరామారం మండలంలో పేరుకుపోయిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29న తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ర్యకలశ్రీశైలం అన్నారు. అనంతరం వారు మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రీశైలం మాట్లాడుతూ ..రాజకీయాలకతీతంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని, ప్రభుత్వాలు మారినా మండలంలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం కాక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. గ్రామ సభల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని, రేషన్ కార్డులు, పెన్షన్ రెట్టింపు, పెళ్ళికానుక – షాదీ ముబారక్ లకు చెక్కులతో పాటు తులం బంగారం, మహిళలకు నెలకు 2500/- రూపాయల చొప్పున, ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు ముక్యర్ల పున్నమ్మ, దేశెట్టి సత్యనారాయణ, లక్ష్మయ్య ,రమేష్, నరేష్, లక్ష్మి ,అరుణ, తదితరులు పాల్గొన్నారు.