
నవతెలంగాణ – తుర్కపల్లి
మండల కేంద్రంలో సీపీఐ(ఎం) పార్టీ మండల కమిటీ సమావేశం సీనియర్ నాయకులు కొక్కొండ లింగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ మాట్లాడుతూ.. మండలంలో స్పెషల్ అధికారుల పాలనలో గ్రామాల లో అభివృద్ధి పనులు కుంటూ పడ్డాయని, ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు కావస్తున్నా, ఎన్నికల హామీల్లో భాగంగా ఆరు గ్యారంటీలలో దాదాపు 418 రకాల హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచి 15 నెలల కాలం అయ్యింది, వారి హామీలలో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం పూర్తిగా అమలు చేస్తూ, మిగతా గ్యారంటీల్లో పూర్తిగా అమలు చేయలేని పరిస్థితి ఉన్నది, గ్రామాలలో పెన్షన్స్ మంజూరు గాక దాదాపు రెండు సంవత్సరాల కాలమైంది,అర్హత కలిగిన పేద ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని, అలాగే పెన్షన్స్ ను డబుల్ చేస్తామన్న హామీని ఇచ్చి ఇంతవరకు చేయలేదు,వెంటనే అర్హత కలిగిన పేద ప్రజలకు నూతన పెన్షన్లు మజురు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, మండలంలో ఇండ్లు లేనిపేద ప్రజలు గత 10 సంవత్సరాలు గా ఆశగా ఎదురు చూసిన ప్రజలకు కాంగ్రెస్ అధికారంలో కి వచ్చి 15 నెలలు అయినా ఇండ్లు,ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు అని, వెంటనే పేద ప్రజలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని పేదలందరికీ ఇండ్లు,ఇండ్ల స్థలాలు ఇవ్వాలని,రేషన్ కార్డులు లేని పేద ప్రజలు నూతనంగా రేషన్ కార్డులు మంజూరు కాక గత 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ,అర్ధాకలితో అలమటిస్తున్నారని ప్రభుత్వం వెంటనే పేద ప్రజలకు నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28న తలపెట్టిన ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నాను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కొక్కొండ లింగయ్య గడ్డమీది నరసింహ తలారి మాతయ్య తూటి వెంకటేశం ఆవుల కలమ్మ గుండెబోయిన వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.