– సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు P. రామకృష్ణ పిలుపు..
నవతెలంగాణ – కామారెడ్డి
పాసిస్ట్, కార్పొరేట్, మతోన్మాద్ధ విధానాలకు వ్యతిరేకంగా డిల్లీలో నిర్వహించే జాతీయ సదస్సుకు విద్యావంతులు, యువకులు హాజరై విజయవంతం చేయాలని సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పీ. రామకృష్ణ పిలుపును ఇచ్చారు. పిబ్రవరి 28-2025న, ఢిల్లీలో జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్టు అయన పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల పార్టీ కార్యాలయంలో సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ మాట్లాడుతు ప్రస్తుతం దేశంలో పాసిస్ట్ మతోన్మాద్ద బిజెపి తమ దాడుల్ని ఎక్కుపెట్టిందని, మతం పేరట విడదీసి రెచ్చగొట్టే రాజకీయాలను అవలంబభిస్తుందినీ ఆయన అన్నారు. దేశంలో ప్రజలు ఎదురకొంటున్న సమస్యలను పరిష్కరించకుండ మతం పేరట చిచ్చు పెడుతుంది అన్నారు. సెక్యులర్ భావాలపై, ప్రజాస్వామిక శక్తులపై తమ దాడులను ఎక్కుపెట్టిందని దేశప్రజలు సంఘటితంగా పాసిస్ట్,మత వాద రాజకీయ పార్టీ అయినా బిజెపి, ఆర్ఎస్ ఏస్ లకు వ్యతిరేకంగా సంఘాటితంగా పోరాడాలి అని ఆయన పిలుపును ఇచ్చారు. అందులో భాగంగానే ఢిల్లీలో పిబ్రవరి 28 – 2025న, జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో పీ.డీ.ఎస్.యూ. రాష్ట్ర కార్యదర్శి జి. సురేష్, సిపిఐ (ఎం. ఎల్) మాస్ లైన్ కామారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు ఏ. ప్రకాష్, పివైఎల్ రాష్ట్ర నాయకులు అనిల్, స్థానిక నాయకులు నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.