
– జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ,తిరుమల ప్రసాద్
నవతెలంగాణ-నసురుల్లాబాద్ : బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్, నసురుల్లాబాద్ మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చేయడంతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు బీర్కూర్ మండలంలోని దామరంచ కిష్టాపూర్ నసూరుల్లా బాద్ మండలంలోని మీర్జాపూర్ తదితర గ్రామాలలో ఉన్న పంట పొలాలను వ్యవసాయ శాఖ బృందం పరిశీలించింది. నిజాంసాగర్ ప్రాజెక్టు 25వ డిస్టిబూటర్ కాలువ ద్వారా మీర్జాపూర్ దామారంచా కిష్టాపూర్ గ్రామాల్లో ఉన్న చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందకపోవడంతో గత వారం రోజుల నుండి రైతులు ఆందోళన చెందడంతో జిల్లా కలెక్టర్ స్పందించి రైతు సమస్యలను తెలుసుకొని నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ వివిధ గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించి రైతులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ పంట పొలాలకు సాగునీరు అందేలా కృషి చేస్తామని రైతులకు భరోసా కల్పించారు. పలు గ్రామ రైతులు మాట్లాడుతూ చివరి ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు అందించాలని, సాగునీటి కాలువల్లో అడ్డంకులను తొలగించాలన్నారు. ఎండాకాలం సాగునీటి కాలువ ల్లో ముళ్లపొదలు పెరగడం, రాళ్లు ఉండడంతో సాగునీరు రావడం లేదని అన్నారు. ఉమ్మడి మండలంలోని వివిధ గ్రామాల్లో సాగునీటి సమస్యలను వ్యవసాయ బృందం వారు చెప్పిన వివరాలను సేకరించారు సేకరించిన వివరాలను జిల్లా కలెక్టర్కు నివేదిక అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు రైతు సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు వీరి వెంట బాన్సువాడ ఏడిఏ అరుణ, మండల వ్యవసాధికారిణి భవాని , ఏఈఓ గోపాల్ ,సాయి సుమన్ తదితరులు పాల్గొన్నారు…