రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర.. 

A conspiracy to undermine the Constitution..– పరిరక్షణకే కాంగ్రెస్ పాదయాత్ర 
నవతెలంగాణ – దుబ్బాక 
కుల, మత బేధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛను ప్రసాదిస్తున్న రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్వీర్యం చేసే కుట్ర పన్నిందని కాంగ్రెస్ అక్బర్ పేట భూంపల్లి మండల కోఆర్డినేటర్ గాంధారి నరేందర్ రెడ్డి ఆరోపించారు.దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు అన్ని గ్రామాల్లో ‘రాజ్యాంగ పరిరక్షణ యాత్ర’ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆదివారం అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని చిన్న నిజాంపేట, రామేశ్వరం పల్లి, నగరం, తాళ్లపల్లి, పోతారెడ్డిపేట గ్రామాల్లో నిర్వహించిన పాదయాత్రలో భాగంగా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ చర్యలను ఎండగడుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. అనంతరం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అంటూ ప్రతిజ్ఞ చేయించారు. వారి వెంట దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకట స్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్, మండల ప్రధాన కార్యదర్శి కోనాపురం బాలు, మాజీ సర్పంచ్ గుండా శంకర్, మాజీ ఎంపీటీసీ బాలాగౌడ్, మండల మహిళా అధ్యక్షురాలు కూతురి సుమలత, నాయకులు బాల్తే వెంకటేశం, ప్రతాప్, జీ.శ్రీధర్, పలువురు పాల్గొన్నారు.
Spread the love