
నవతెలంగాణ – తొగుట
రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ బాధ్యత అని మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి అన్నారు. శనివా రం మండలంలోని వర్ధరాజ్ పల్లి, గోవర్ధనాగిరి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పాద యాత్ర చేశారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లో భాగంగా గాంధీజీ, అంబే ద్కర్ విగ్రహాలకు పూల మాల వేశారు. మండల కో ఆర్డనేటర్ అనం తుల శ్రీనివాస్ రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయిం చారు. అనంతరం బిజెపి పూర్తిగా చెడగొట్టే ప్రత్నం చేస్తుందని ఆరోపించారు. రాజ్యాం గాన్ని పరిరక్షిం చే బాధ్యత ప్రతి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల తీసుకోవాలని సూచించారు. కార్య క్రమంలో మాజీ ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి, నాయకులు గంట రవీందర్, సీనియర్ నాయకులు తోయేటి ఎల్లం, దేవునూరి పోచయ్య, నిర జన్ రెడ్డి, బషీర్, పంది రాజు, బెజ్జనబోయిన అని ల్, మల్లారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ ప్రశాంత్, సాజిద్, భాను తదితరులు పాల్గొన్నారు.