మేడారంలో హుండీల లెక్కింపు..

– మొత్తం ఆదాయం 42,10,902
నవతెలంగాణ – తాడ్వాయి
మేడారం సమ్మక్క- సారలమ్మ హుండీలను దేవదాయ శాఖ అధికారులు భారీ బందోబస్తు నడుమ గురువారం లెక్కించారు. సమ్మక్క ఆదాయం రూ. 21,83,867, సారలమ్మ ఆదాయం రూ. 17,58,083, గోవిందరాజు ఆదాయం రూ. 1,13,998, పగిడిద్దరాజు రూ. 1,54, 954.‌ సమ్మక్క సారలమ్మ మొత్తం వనదేవతల ఆదాయం 42,10, 902 లక్షలు ఆదాయం వచ్చినట్లుగా ఎండోమెంట్ ఈవో రాజేంద్రం తెలిపారు. మహా జాతర అనంతరం మార్చి 28, నుండి జూన్ 27 వరకు మూడు నెలల్లో 22 హుండీలలో వచ్చిన మేడారం వనదేవతల ఆదాయం అని తెలిపారు. కాగా స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు చంద గోపాల్, చందా రఘుపతి, సిద్ధబోయిన అరుణ్, సిద్ధబోయిన నితిన్, వసంతరావు, కాక కిరణ్, పూజారులు, ఎండోమెంట్ ఈవో రాజేంద్రం, ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, సూపర్డెంట్ క్రాంతి, జూనియర్ అసిస్టెంట్లు, రాజేశ్వరరావు, జగన్, మధు, రఘుపతి, బాలకృష్ణ, కిషన్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ డేగల సాంబయ్య, ఎండోమెంట్, రెవెన్యూ ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love