నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో హుస్నాబాద్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేస్తూ శనివారం సీపీఐ బృందం మంత్రి పొన్నం ప్రభాకర్ ను మంత్రి కార్యాలయం కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు హర్షనియమన్నారు. గతంలో కంటే ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌కి అనేక అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. మంత్రి హయాంలో హుస్నాబాద్ నియోజకవర్గంను రాష్ట్ర స్థాయిలో అభివృద్ధిలో నంబర్ వన్ స్థానంలో ఉంచుతారని నమ్మకం ఉందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు సమస్యల పైన వినతి పత్రం అందజేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో సీపీఐ నాయకులు యెడల వనేశ్, కొమ్ముల భాస్కర్,జేరిపోతుల జనార్ధన్,ముంజ గోపి,సుదర్శన చారి,మంద శ్రీనివాస్,హరిఫ్,పిల్లి రజిని,బోనగిరి శంకర్, ఎల్లయ్య,విజయ్,ఎంకన్న,తదితరులు ఉన్నారు.