500 లకే నేరుగా లబ్ధిదారులకు గ్యాస్ సిలెండర్ అందించాలి: సీపీఐ వెంకటేశ్వర్లు

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న గ్యాస్ సిలెండర్ నేరుగా ఐదు వందల రూపాయలకు లబ్ధిదారులకు అందించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ధర్మబిక్షo భవన్ సీపీఐ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన గ్యాస్ సిలెండర్ తీసుకొంటే, నేరుగా లబ్ధిదారులకు  బ్యాంకు ఖాతాలలో పైసలు జమ చేస్తామనటం కరెక్ట్ కాదని, ఐదు వందల రూపాయలు తీసుకొని గ్యాస్ సిలెండర్ ఇస్తే ఏ గందరగోళం ఉండదని ఆయన అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ పైసలు బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నామని చెప్పి, రెండు, మూడు నెలలు జమచేసి ఆ తర్వాత జమ చేయలేదని ఆయన అన్నారు. మొత్తం పైసలు ముందు చెల్లించి గ్యాస్ సిలెండర్ తీసుకోవాలన్నా పేదలకు ఆర్థికంగా ఇబ్బంది గా ఉంటుందని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నేరుగా లబ్ధిదారులకు ఐదు వందల రూపాయలకే, గ్యాస్ సిలెండర్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో నాయకులు నిమ్మల ప్రభాకర్, పెన్డ్రా కృష్ణ, దండుగల సురేష్, సింగజోగి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love