Friday, May 8, 2026
E-PAPER
Homeజిల్లాలుబీటెక్ విద్యార్థి యావన్ హ‌త్య‌ను ఖండించిన సీపీఐ(ఎం)

బీటెక్ విద్యార్థి యావన్ హ‌త్య‌ను ఖండించిన సీపీఐ(ఎం)

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: హైదరాబాద్ బీటెక్ విద్యార్థి యావన్ హ‌త్య‌ను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఈమేర‌కు శుక్ర‌వారం ప్రెస్‌నోట్ విడుద‌ల చేసింది. యావ‌న్‌ను ప‌క్క ప‌థ‌కం ప్ర‌కారం రెక్కి నిర్వ‌హించి ఇంత‌టి దారుణానికి పాల్ప‌డ్డార‌ని మండిప‌డింది. కులం, మతం పేరుతో జ‌రుగుతున్న ‘కుల‌దుర‌హంకార హ‌త్య‌ల‌పై’ స‌మాజంలో చైత‌న్యం తేవ‌డానికి, కులాంత‌ర వివాహాల ర‌క్ష‌ణకు ప్ర‌భుత్వం అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీపీఐ(ఎం) విజ్ఞ‌ప్తి చేసింది. నిందితుల‌ను అంద‌ర్నీ వెంట‌నే అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచార‌ణ జ‌రిపి శిక్షించాల‌ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబాన్ని ప్ర‌భుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాల‌ని కోరారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ‌జేశారు.

కాగా, జవహర్‌నగర్‌కు చెందిన యావన్ (23) మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అల్వాల్‌కు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో వారి ప్రేమను వ్యతిరేకించారు. అతనిపై పగ పెంచుకుని హత్య చేశారు యువతి కుటుంసభ్యులు. గురువారం రాత్రి ఆరుగురు వ్యక్తులు మూడు ద్విచక్రవాహనాలపై యావన్ ఇంటికి వచ్చి, టీవీ చూస్తున్న అతనిపై కత్తులతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని బయటకు పరిగెత్తినా వదలకుండా విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -