ఎస్ బీ ఐ ఛైర్మన్ ను వెంటనే అరెస్టు చేయాలి: సీపీఐ(ఎం)

నవతెలంగాణ – నూతనకల్
సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలను వెల్లడించకుండా బీజేపీకి మోడీకి తొత్తుగా వ్యవహరిస్తున్న ఎస్ బి ఐ చైర్మన్ ను అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎస్ బి ఐ బ్యాంకు ముందు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపుమేరకు నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ఇవి అవినీతికి ఆస్కారంగా ఉన్నాయని అన్నారు. మార్చి 6వ వరకు ఎన్నికల కమిషన్ బాండ్ల వివరాలు అందజేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ఎస్ బి ఐ విఫలం అయిందని విమర్శించారు.. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన ఎస్బిఐ చైర్మన్ ను వెంటనే అరెస్టు చేయాలని ప్రజల  బ్యాంకును బీజేపీ బ్యాంకుగా మార్చవద్దని ఎలెక్టోరల్ బాండ్ల వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలనీ డిమాండ్ చేశారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ కు మెమోరండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం ,మండల నాయకులు బొజ్జ శ్రీను ,గజ్జల శ్రీనివాస్ రెడ్డి , కూసు సైదులు, ముండ్ల సంజీవ ఫులసరి వెంకటముత్యం,తొట్ల లింగయ్య, బాణాల విజయ రెడ్డి ,మున్న నాగమల్లు తొట్ల ఆనంద్ కూసుకుంట్ల ప్రవీణ్ ఉప్పల రమేష్ దేవరకొండ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Spread the love