ధాన్యం కొనుగోళ్లును వేగవంతం చేయాలి: సీపీఐ(ఎం)

నవతెలంగాణ – చండూరు  
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ము దిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం గట్టుపల్ మండల పరిధిలోని తేరటుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతు పండించిన పంటకు గిట్టుబాటు కల్పించాలని ఆయన అన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయనఅన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రాల్లోరైతులకుఎలాంటి అసౌకర్యం కల్పించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఎండలు తీవ్రత ఉండడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ఒఆర్ఎస్ ప్యాకెట్లు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనిఆయన అన్నారు. రైతులు తాము తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని  వారి సీనియార్టీ ప్రకారం పేర్లను సక్రమంగా రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంఎన్నికల ముందు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించి నేటికీ అమలు చేయలేదని ఆయన అన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వారి అకౌంట్లో జమ చేయాలని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, గట్టుపల సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులుకర్నాటి సుధాకర్, అచ్చిన శ్రీనివాస్, ఖమ్మం రాములు, సీపీఐ(ఎం) గ్రామ నాయకులు గిరి బిక్షం,  నరసింహ, వల్గూరి జంగయ్య, నగేష్, బోయపల్లి మల్లయ్య, నరసింహతదితరులు పాల్గొన్నారు.
Spread the love