పంటలు ఎండి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సీపీఐ(ఎం)

– సీపీఐ(ఎం) పార్టీ జిల్లాకార్యదర్శి వర్గ  సభ్యులు  దాసరి పాండు
నవతెలంగాణ –  బొమ్మలరామారం
ఆరుగాలం కష్టపడి పెట్టుబడి పెట్టి బావుల్లో బోరుల్లో భూగర్భజాలాలు అడుగంటి పంట ఎండిపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లాకార్యదర్శి వర్గ  సభ్యులు  దాసరి పాండు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో మండలం దేవినితండా గ్రామంలో  భాస్కర్ అనే రైతు 10 ఎకరాల పైగా ఎండిపోయిన వారి పంట పొలాలను పరిశీలించడం జరిగింది.అనంతరం మాట్లాడుతూ.. ఎకరానికి దాదాపు 30 వేల రూపాయలు ఎకరానికి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి రైతులు కష్టపడితే బావులు బోర్లు వట్టిబోయి పెట్టిన వరి పంట ఎండిపోయి పోవడంతో రైతులకు కన్నీరే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి అధికారులతో సర్వే చేయించి పంటలు ఎండిపోయిన ప్రతి రైతు కుటుంబానికి ఎకరానికి 30 వేల చొప్పున ఆర్థిక సహయం అందించాలి, మండలంలో సాగు త్రాగు నీరందించే విధంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యకలశ్రీశైలం, రైతులు భాస్కర్, సన్నాఫ్ పాండు, సన్నాఫ్ పాండు రామ్ చందర్, సన్నాఫ్, బాత్య, చంద్రు,అమర్,  పాండు ,అంగూర ,రామ్ తార్ చందర్, భూక్య శంకర్స,న్నాఫ్ పాండ్యా, తదితరు నాయకులు పాల్గొన్నారు.
Spread the love