నవతెలంగాణ – కంఠేశ్వర్
సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఎర్ర శ్రీకాంత్ గుండె నొప్పితో చనిపోవడంతో జిల్లా కమిటీ తరఫున ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. పార్టీ అఖిల భారత మహాసభలు తమిళనాడు రాష్ట్రంలోని మధురై లో జరుగుతున్నందున అఖిల భారత మహాసభలకు తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికైనటువంటి ప్రతినిధులలో ఒకరుగా ఉన్న శ్రీకాంత్ గత నాలుగు రోజులుగా చురుకుగా మహా సభల్లో పాల్గొని చివరి రోజున ఆదివారం గుండె నొప్పి రావడంతో అక్కడే ప్రాణాలు వదలడం జరిగిందని తెలిపారు. ఎర్ర శ్రీకాంత్ ఖమ్మం జిల్లాకు చెందిన వారని అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొని దోపిడీ లేని సమ సమాజ నిర్మాణం కోసం పరితపించారని ఆయన పోరాట పట్టిమను గుర్తించి గత రెండు మహాసభల నుండి రాష్ట్ర కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికైనరని భాగంగానే రెండవ తేదీ నుండి జరిగే అఖిలభారత మహాసభలకు ప్రతినిధిగా ఎన్నికై మహాసభల్లో పాల్గొంటున్న సందర్భంలో గుండె నొప్పి వచ్చి ప్రాణాలు వదలటం జరిగిందని ఆయన మరణం పార్టీ ఉద్యమానికి తీవ్ర లోటని ఆయన ఏ ఆశయం కొరకు ఉద్యమంలో ఆదర్శంగా నిలిచారు. ఆయన ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన మరణానికి పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్ జిల్లా కమిటీ సభ్యులు విగ్నేష్, నాయకులు కటారి రాములు, ఉద్ధవ్, దినేష్, రాజు, సుచిత్, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.